యూఎస్‌లో సినిమాల కంటే లైబ్రరీకే ఎక్కువగా వెళ్లారట

 ప్రపంచంలో హాలీవుడ్‌ మార్కెట్ ఎంత పెద్దగా ఉంటుందో పెద్దగా వేరే చెప్పనవసరం లేదు. 2019 ఏడాదిలో యూఎస్ ఫిల్మ్‌ ఇండస్ర్టీ 40 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆదాయాన్ని కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. కానీ అమెరికాలోని పబ్లిక్‌ లైబ్రరీతో పోటీ పడాలంటే మాత్రం హాలీవుడ్‌ ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని గాలప్‌ పోల్‌ సంస్థ పేర్కొంది. అదేంటి హాలీవుడ్‌ మార్కెట్‌కు, పబ్లిక్‌ లైబ్రరీకి సంబంధం ఏంటనే డౌట్‌ వస్తుందా.. అక్కడే అసలు విషయం ఉంది. 2019 ఏడాదిలో అమెరికాలో సినిమాల కంటే లైబ్రరీలకు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గాలప్‌ పోల్‌ తన సర్వేలో వెల్లడించింది.